హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోచారం వద్ద అతివేగంతో దూసుకొచ్చిన వెన్యూ కారు అదుపుతప్పి, రింగ్ రోడ్డు పైనుంచి ఒక్కసారిగా కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడిపోయింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జవ్వగా, అందులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్న పాప ఉన్నారు. వీరంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బాచుపల్లి వైపు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది

