విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై జోగి రమేష్ నిన్న చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ఆయన వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన వారి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వైపు దూసుకెళ్లారు. కొందరు ఆందోళనకారులు జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు.

