టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మాత్రమే కాదు, మానవతా విలువలతో కూడిన సేవా కార్యక్రమాల ద్వారా కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లోని సుమారు 500 మంది సభ్యులు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించేందుకు ముందుకు వచ్చారు. గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ఈ హెల్త్ కార్డుల పంపిణీకి ఆయన ఆమోదించారు. ఈ పథకం కోసం రామ్ చరణ్ సుమారు రూ.50 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం.

