తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై సుప్రీంకోర్టు గురువారం జోక్యం చేసుకుంది. ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా, సజావుగా సాగేలా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు సూచించింది. ప్రభుత్వ కార్యాలయాలలో ‘తార్కిక వ్యత్యాసాల’ జాబితాలోని ఓటర్ల పూర్తి జాబితాను ప్రచురించాలని, పేర్లు లేనివారు 10 రోజుల్లోపు సంబంధిత పత్రాలను సమర్పించడానికి అనుమతించాలని ఈసీని ఆదేశించింది. రాష్ట్రంలోని ఎస్ఐఆర్ అనంతరం 97 లక్షల ఓట్లను తొలగించారు..

