కాలిఫోర్నియాలోని ఫులెర్టోన్లో ఎస్యూవీ కారు ఎడమ వైపు మలుపు తిరుగుతున్న సమయంలో కారు ప్యాసింజర్ డోర్ అకస్మాత్తుగా తెరుచుకుంది. ఒక్కసారిగా కారులోంచి 19 నెలల పిల్లాడు రోడ్డుపై పడిపోయాడు. వెనకే వస్తోన్న కారు డ్రైవర్ అప్రమత్తం అవ్వడంతో ప్రమాదం తప్పింది. వెంటనే డ్రైవింగ్ చేస్తోన్న చిన్నారి తల్లి కారులోంచి కిందకు దిగి చిన్నారిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. కారు వివరాలతో సదరు మహిళను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

