ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనానికి దారి తీశాయి. బాలీవుడ్లో తనకు అవకాశాలు రావడం లేదని.. అందుకు మతపరమైన అంశం కూడా కారణం అయి ఉండొచ్చు కానీ.. తాను ఆ కోణంలో ఆలోచించడం లేదంటూ రెహమాన్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అవి డేంజరస్ కామెంట్స్’ అని రచయిత్రి శోభా డే మండిపడ్డారు. కమ్మూనిటీ కారణంగానే ఆయనకు అవకాశాలు తగ్గుతున్నాయనే దాన్ని నేను నమ్మను’’ అని రైటర్ జావేద్ అక్తర్ అన్నారు

