తమ పొరుగు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై అవసరమైతే దాడి చేస్తామంటూ ఇరాన్ హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఖతర్‌లోని అల్ ఉదైద్ అమెరికా వైమానిక స్థావరంలోని కొందరు అధికారులను అగ్రరాజ్యం వెనక్కు రమ్మని పిలిచినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. అమెరికా దాడులు మొదలైన పక్షంలో తామూ పొరుగు దేశాల్లోని అగ్రరాజ్య సైనిక స్థావరాలపై దాడి చేస్తామని తేల్చి చెప్పింది.

