మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తలసాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రవికిరణ్ దేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు తెలిపారు.

