పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ప్రతిపాదించిన తేదీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజైన జనవరి 28న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. 29న ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 2న కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదట విడత ఫిబ్రవరి 13 వరకూ,అనంతరం రెండో మార్చి 9న ప్రారంభమైన ఏప్రిల్ 2 వరకూ జరుగుతాయి.

