పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకున్న స్టార్ హీరోయిన్ సమంత, ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీలో నటిస్తూ సుదీర్ఘ విరామం అనంతరం ఆమె బిగ్ స్క్రీన్‌పై రీఎంట్రీ ఇవ్వనుంది. సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా టీజర్ ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేయగా, అది అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సమంత పూర్తిగా మాస్ అవతార్‌లో కనిపించారు.

