నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమన కాండపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. నిన్న దిల్‍సుఖ్‍నగర్, నేడు అశోక్ నగర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నవు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నవని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు

