ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో దాదాపు అన్ని రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్‌లో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, బ్యాంకులు AI వినియోగాన్ని పెంచుతున్నాయి.
అదే సమయంలో ఫిజికల్ బ్రాంచ్ నెట్‌వర్క్‌ను తగ్గించడం కొనసాగిస్తున్నాయి. 2026 నుంచి పెద్ద మొత్తంలో బ్యాంక్ ఉద్యోగాలు కోల్పోవచ్చని పేర్కొంది. రాబోయే ఐదు సంవత్సరాలలో 200,000 కంటే ఎక్కువ బ్యాంకింగ్ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అంచనా వేసింది.

