డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ పెడ్లర్స్తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ.. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అమన్.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో అమన్ ప్రీత్ సింగ్ ఏ7గా ఉన్నాడు. గతేడాది డిసెంబర్ లో ఈగల్ టీమ్ కు పట్టబడిన డ్రగ్స్ పెడ్లర్స్తో అమన్ కు సంబంధాలు ఉన్నాయని వారి నుంచి అమన్ పలుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

