గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన ప్రమాద సమయంలో ‘షోలో’ చిత్రంలోని ‘మెహబూబా మెహబూబా’ పాటతో అందరి దృష్టిని ఆకర్షించిన బెల్లీ డాన్సర్ క్రిస్టినా పైనా దర్యాప్తు సంస్థలు తాజాగా దృష్టి సారించారు. క్రిస్టినా బిజినెస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు,అయితే వీసా ఇంకా అప్రూవ్ కాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చెల్లుబాటయ్యే పర్మిట్ లేకుండా ఆమె ఇండియాలో పనిచేస్తున్నారా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

