ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో వ్యాపారి దీపక్ టండన్ , రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా డీఎస్పీ కల్పనా వర్మ తన నుంచి రూ. 2 కోట్లకుపైగా వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. 2021లో కల్పనా వర్మను ఆయన తొలిసారి కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ సంబంధంలోకి వెళ్లారని చెప్పారు. దీపక్ రూ. 2 కోట్లు కల్పనాకు ఇచ్చానని తెలిపారు. రూ. 1 లక్ష బ్రేస్లెట్, రూ. 5 లక్షల బంగారు గొలుసు, రూ. 12 లక్షల విలువైన డైమండ్ రింగ్ కూడా బహుమతిగా ఇచ్చినట్లు చెప్పారు.

