బిహార్ ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేర సంచలన ఆరోపణలు చేశారు. ‘హోం మంత్రి ఎప్పుడు పాట్నా వచ్చినా హోటల్ ఎలివేటర్లలోని సీసీటీవీ (కెమెరాలు)పై పేపర్లు అంటిస్తున్నారు. అధికారులతో ఆయన రహస్య మంతనాలు సాగిస్తున్నారు. అంత రహస్యంగా మీరు జరుపుతున్న సమావేశాలు ఏమిటి?’ అని అమిత్‌షాను ఆయన ప్రశ్నించారు. తొలి దశ పోలింగ్‌లో తమకు సానుకూలంగా లేకపోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలను కుదించుకున్నట్టు తెలిసిందని పవన్‌ఖేరా చెప్పారు.

