రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో తన కారుకు వెంటనే ఇంధనం నింపనందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ పెట్రోల్ బంకు సిబ్బంది చెంపపై కొట్టాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణపై ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె నకిలీ భార్య అన్నది వెలుగులోకి వచ్చింది. పెట్రోల్ బంకులోని ఒక సిబ్బంది తనను చూసి కన్నుగీటి అసభ్యకరమైన వ్యాఖ్య చేసినట్లు ఆరోపించింది. దీంతో తన భర్త అయిన ఎస్డీఎం జోక్యం చేసుకోవడంతో ఈ గొడవ జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

