ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ లో టీమిండియా ఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్ లో శ్రీలంక చిత్తుగా ఓడిపోయింది. భారత్ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 9.5 ఓవర్లలోనే కేవలం 45 పరుగులకే కుప్పకూలిపోయింది. టీమిండియా 124 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇక, అక్టోబర్ 3న ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, దాయాది పాకిస్తాన్ తో తలపడనుంది.

