loader

గజ్వేల్ గడీ కూల్చినట్లే సిరిసిల్ల గడీని నేలమట్టం చేస్తాం.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

గజ్వేల్ గడీ కూల్చినట్లే ఈసారి సిరిసిల్ల గడీని నేలమట్టం చేద్దామని కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్ కుటుంబంపై సీఎం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గరుడ పక్షి దెబ్బ కాకి పిల్లకు ఏం తెలుసని ఎద్దేవా చేశారు. అమెరికా హోటళ్లలో ప్లేట్లు కడిగిన వ్యక్తికి తన విలువ ఎలా తెలుస్తుందని ఘాటుగా స్పందించారు. ఫామ్‌హౌస్‌లలో […]

గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 2న కొనసాగనున్న యూపీఐ సేవలు

UPI లావాదేవీలపై ప్రతిపాదించిన మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR) ఛార్జీలకు వ్యతిరేకంగా అక్టోబర్ 2వ తేదీన చేపట్టాలని తలపెట్టిన ‘నో యూపీఐ డే’ నిరసన కార్యక్రమాన్ని వ్యాపార సంఘాలు అధికారికంగా విరమించుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వ్యాపారులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని, తగిన భరోసా లభించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కారణంగానే అక్టోబర్ 2న జరగాల్సిన నిరసన పిలుపును పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు […]

సెంచరీలతో అదరగొట్టిన రోహిత్​, గిల్- 12 వేల పరుగుల మైలురాయి దాటిన హిట్​మ్యాన్​

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్‌ శర్మ, గిల్​ సెంచరీలతో అదరగొట్టారు. 72 బంతుల్లో రోహిత్​ శర్మ శతకం చేసి అరుదైన ఘనత సాధించాడు. రోహిత్‌కు వన్డేల్లో ఇది 35వ సెంచరీ. వన్డేల్లో 12,000 పరుగులు పూర్తి చేశాడు. సచిన్, కోహ్లీ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మూడో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఇక గిల్‌ కూడా 62 బంతుల్లో సెంచరీ చేసి అదరగొట్టాడు. గిల్‌కు ఇది వన్డేల్లో పదకొండో సెంచరీ కాగా, కెప్టెన్‌గా మూడో సెంచరీ […]

ఏపీలో ‘సర్’ షెడ్యూల్ ను సవరించిన కేంద్ర ఎన్నికల సంఘం

ఏపీలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. అక్టోబరు 16న తుది జాబితా ప్రకటించాలని నిర్ణయించింది. వచ్చే నెల 10 వరకు నోటీసులు, క్లెయిమ్లు, అభ్యంతరాలు పరిశీలించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబరు 5 వరకు అవకాశం కల్పిస్తామని, అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని గతంలో ఈసీ ప్రకటించింది. తాజాగా ఆ గడువును మరోసారి పొడిగించింది.

ఆటోలో రజనీకాంత్.. షాక్ అయిన ఫ్యాన్స్.. వీడియో వైరల్

ప్రస్తుతం రజనీకాంత్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ధర్మన్ అనే సినిమా షూటింగ్‌కు ఆయన ఆటోలో వెళ్లారు. ఇది చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ధర్మన్ చిత్రీకరణ కర్ణాటకలోని మైసూర్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం రజనీకాంత్ వస్తారని, అభిమానులు గేట్ల వద్ద ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అప్పుడే ఆయన ఒక ఆటోలో అక్కడికి వచ్చి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. అనంతరం రజనీకాంత్ అభిమానులను పలకరించి సెట్స్‌కు వెళ్లిపోయారు.

ముగిసిన వర్షాకాలం- 13 శాతం లోటు

ఈ ఏడాది వర్షాకాలం అధికారికంగా ముగిసిపోయింది. జూన్ లో మొదలయ్యే రుతుపవనాల సీజన్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది. ఇందులో భాగంగా జూన్ తో మొదలయ్యే వర్షాలు సెప్టెంబర్ నాటికి పూర్తి వర్షపాతం అందించడం పరిపాటిగా వస్తోంది. కానీ ఈసారి మాత్రం ఎల్ నినో ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో దేశమంతా వర్షపాత లోటే. తాజాగా కురిసిన వర్షాలతో పరిస్ధితి కాస్త మెరుగుపడినా, అంతిమంగా 13 శాతం వర్షాల లోటుతో ఈసారి సీజన్ ముగిసింది.

కృత్రిమ మేధ పేరు మార్పుతో ముప్పు తొలగిపోతుందా? AI నుంచి SI

గూగుల్, మెటా, ఓపెన్‌ఏఐ, ఎన్విడియా వంటి ప్రముఖ టెక్ దిగ్గజాలతో సమావేశమైన అనంతరం, ఆర్టికల్ ఇంటెలిజెన్స్ (AI)ను “సూపర్ ఇంటెలిజెన్స్” (SI)గా పేరు మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపింది. ఈ పేరు మార్పు చట్టపరంగా, రాజకీయంగా ఒక ముందడుగులా అనిపించినప్పటికీ.. సాంకేతిక, భద్రతా ప్రమాణాల నుండి ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. అదేమిటంటే, AI పేరును SIగా మార్చడం వల్ల దాని నిజమైన ప్రమాదాలు వాస్తవంగా తగ్గుతాయా? […]

మంగ‌ళూరు రిఫైన‌రీలో పేలుడు.. ఎనిమిది మందికి గాయాలు

క‌ర్ణాట‌క‌, మంగ‌ళూరులోని ఒక రిఫైన‌రీలో పేలుడు ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారు. మంగ‌ళూరులో ఉన్న మంగ‌ళూరు రిఫైన‌రీ అండ్ పెట్రోకెమిక‌ల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్‌) వ‌ద్ద బుధ‌వారం ఈ పేలుడు జ‌రిగింది. మొత్తం ఎనిమిది మంది గాయ‌ప‌డ‌గా.. వీరిలో ఒక‌రికి 35 శాతం కాలిన గాయాలైన‌ట్లు ఎంఆర్‌పీఎల్ సంస్థ వెల్ల‌డించింది. జోక‌ట్టే గ్రామ ప‌రిధిలోని ఎంఆర్‌పీఎల్ కాంప్లెక్స్‌లో జరిగిన పేలుడు ప్ర‌భావంతో రిఫైన‌రీ చుట్టుప‌క్క‌ల బిల్డింగులు, నివాసాలు కూడా కంపించాయి, బాజ్పే ప‌రిధిలోని మంగ‌ళూరు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులోని ప‌లు […]

అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా పేమెంట్స్ బంద్.. నిలిచిపోనున్న సేవలు..

యూపీఐ ఛార్జీలకు నిరసనగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘నో యూపీఐ డే'(No UPI Day) పాటిస్తామని CTI ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా ఆ రోజు వ్యాపారులు UPI క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్సులను నల్ల గుడ్డతో కప్పి నిరసన వ్యక్తం చేయనున్నారు. ఢిల్లీ లజపత్ నగర్ మార్కెట్ నుంచి నో యూపీఐ డే ప్రచారం ప్రారంభమవ్వగా.. దేశవ్యాప్తంగా 2000కుపైగా ప్రాంతాల్లో నిరసనలు కొనసాగనున్నాయి. డిజిటల్ చెల్లింపులపై రుసుంలు విధిస్తే UPI లావాదేవీలు 50 శాతం […]

ప్రధాని మోదీ, CEC జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు!

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో పూర్తి చట్టపరమైన మినహాయింపు పొందుతున్న ఏకైక వ్యక్తి సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ మాత్రమేనని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON