వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ, గిల్ సెంచరీలతో అదరగొట్టారు. 72 బంతుల్లో రోహిత్ శర్మ శతకం చేసి అరుదైన ఘనత సాధించాడు. రోహిత్‌కు వన్డేల్లో ఇది 35వ సెంచరీ. వన్డేల్లో 12,000 పరుగులు పూర్తి చేశాడు. సచిన్, కోహ్లీ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మూడో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఇక గిల్ కూడా 62 బంతుల్లో సెంచరీ చేసి అదరగొట్టాడు. గిల్‌కు ఇది వన్డేల్లో పదకొండో సెంచరీ కాగా, కెప్టెన్‌గా మూడో సెంచరీ కావడం విశేషం.

