గూగుల్, మెటా, ఓపెన్‌ఏఐ, ఎన్విడియా వంటి ప్రముఖ టెక్ దిగ్గజాలతో సమావేశమైన అనంతరం, ఆర్టికల్ ఇంటెలిజెన్స్ (AI)ను “సూపర్ ఇంటెలిజెన్స్” (SI)గా పేరు మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపింది. ఈ పేరు మార్పు చట్టపరంగా, రాజకీయంగా ఒక ముందడుగులా అనిపించినప్పటికీ.. సాంకేతిక, భద్రతా ప్రమాణాల నుండి ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. అదేమిటంటే, AI పేరును SIగా మార్చడం వల్ల దాని నిజమైన ప్రమాదాలు వాస్తవంగా తగ్గుతాయా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

