loader

సౌజన్య, సాధిక్ రిలేషన్‌..మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ

పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక విషయాలను జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ మీడియాకు వెల్లడించారు. మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడని ఎస్పీ తెలిపారు. భర్త మృతి విషయంలో సౌజన్య పాత్ర ఉందా లేదన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు. సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారని, చివరికి వేధింపులు బారిన పడి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని వివరించారు. సాధిక్ పై మరిన్ని ఆరోపణలు వస్తున్నాయని, సాధిక్ ఖాన్‌పై హత్య, బలవంతపు మతమార్పిడి వంటి […]

కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి

గుజరాత్ మోదీ చేతిలో కట్టు బానిసలుగా ఉండాలనుకుంటున్నారా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారా అని రాష్ట్ర బీజేపీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ నాయకుల మెతకవైఖరి వల్ల గుజరాత్ వాళ్లు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. తమకు పెట్టుబడులు రావేమోనని.. గుజరాత్ కు చెందిన నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం పర్యటనకు అనుమతించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని విదేశాల్లో అడ్డుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇది నాకు కాదు తెలంగాణకు జరిగిన […]

ఇన్‌-సర్వీస్‌ టీచర్ల టెట్‌.. నోటిఫికేషన్‌ విడుదల

ఏపీ ఇన్-సర్వీస్ టీచర్లకు గుడ్ న్యూస్. ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ విడుదల: 24 ఆగస్టు 2026, పరీక్షల నిర్వహణ: 11 – 21 అక్టోబర్ 2026 ఆధికారిక వెబ్‌సైట్ http://cse.ap.gov.in ద్వారా టీచర్లు ఈ స్పెషల్ టెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ విద్యాశాఖ సూచించింది. హెల్ప్‌డెస్క్ నంబర్లు 8121947387, 6281704160, 7995649286

ఐటీఐ అర్హతతో.. రైల్వేలో 1,599 ఉద్యోగాలు

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. భువనేశ్వర్ రిక్రూట్‌మెంట్ సెల్ ద్వారా 1,599 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ వంటి 25 రకాల ట్రేడ్స్‌లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సెప్టెంబర్ 15న సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు..అధికారిక వెబ్ సైట్ http://eastcoastrail.indianrailways.gov.in ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి […]

36 గంటల్లో సమస్యల పరిష్కారం.. మంత్రి పొంగులేటి

సంచలనంగా మారిన 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై గత కొన్ని రోజులుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూములు, నిషేధిత భూములు కాకున్నా ఈ జాబితాలో ఉండి, స్లాట్ బుక్ చేసుకున్న భూముల సమస్యను 24 గంటల నుంచి 36 గంటల్లో పరిష్కరిస్తామన్నారు. గతంలో 22ఏ కింద గతంలో రిలాక్సేషన్ ఇచ్చిన భూములు మళ్లీ ఆ జాబితాలో వచ్చినా పరిష్కరిస్తాం. గతంలో స్లాట్స్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి […]

ఆ ఎన్నికల షెడ్యూల్‌ ఫేక్‌.. షేర్‌ చేస్తే కఠిన చర్యలు: ఏపీ ఎస్‌ఈసీ

ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ పేరుతో దుష్ప్రచారం జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిలచంద్ర పునేఠా తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. అధికారిక గుర్తులను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ప్రచారం నిజమా? కాదా? అనే విషయంపై వివరణ కోరుతూ వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొందరు […]

ఉద్యోగుల తాజా వార్నింగ్..! 28న విజయవాడలో తాడో పేడో..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాకపోవడం వారిలో ఆందోళన పెంచుతోంది. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, కూటమి మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని ఏపీ జేఏసీ నేతలు ఇవాళ ప్రభుత్వాన్ని కోరారు. చర్చల పై నిర్ణయాల కాలయాపనకు స్వస్తి చెప్పాలన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో చర్యలు తీసుకోకపోతే ఈ నెల 28న విజయవాడలో జరిగే రాష్ట్ర స్దాయి భేటీలో […]

సౌజన్య ఆత్మహత్య లేఖలో సాధిక్‌- వెలుగులోకి లవ్ జిహాద్ కోణం : విజయసాయి

పంచాయతీ రాజ్ AE కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య ఘటనలో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ఘటనను లవ్ జిహాద్‌కు సంబంధించినదిగా అభివర్ణించారు. సౌజన్య… తన మరణ వాంగ్మూలంలో ఏం చెప్పారో ప్రతి ఒక్కరికీ తెలియాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ ఈ అంశాలు చదవాలి. ఇది లవ్ జిహాద్‌కు సంబంధించిన ఘటన” అని తెలిపారు. రాజకీయ పార్టీలు ఇలాంటి అంశాలను బయటకు రాకుండా తొక్కిపెడుతున్నాయని కూడా ఆయన ఆరోపించారు.

ఆ వీడియోలో ఉన్న‌ది నేను కాదు.. అయినా త‌ప్పేంటి: మంత్రి కీర్త‌న‌

న‌లుపు రంగు షార్ట్ డ్రెస్సు వేసుకుని కారులో నుంచి దిగిన ఓ మ‌హిళ వీడియో , ఆ వీడియోలో ఉన్నది ప‌రిశ్ర‌మ‌ల మంత్రి ఎస్ కీర్త‌న అంటూ డీఎంకే అభిమానులు సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేశారు. ఆ వీడియోలో ఉన్న మ‌హిళ తాను కాదు అని, కానీ ఒక‌వేళ అది తానే అయినా దాంట్లో ఇబ్బంది ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. కీర్త‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో కామెంట్ చేస్తూ.. స‌మాజానికి ఏమీ చేయ‌లేని వారు స్త్రీల‌ను ద్వేషిగా […]

రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం..!

పెద్దపల్లి జిల్లా రామగుండం అయోధ్యనగర్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు కలకలం రేపాయి. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ ను విచారించినట్లు సమాచారం. విద్యార్థి కదలికలు, సంబంధాలు, ఇతర అంశాలపై ఎన్ఐఏ ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్థిపై ఉన్న ఆరోపణలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON