ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ పేరుతో దుష్ప్రచారం జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిలచంద్ర పునేఠా తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. అధికారిక గుర్తులను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ప్రచారం నిజమా? కాదా? అనే విషయంపై వివరణ కోరుతూ వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొందరు షేర్ చేస్తున్నది ఫేక్ షెడ్యూల్.