loader

మహారాష్ట్ర ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలన్న రాహుల్ గాంధీ..

రాహుల్ గాంధీ సోషల్ మీడియా Xలో ఒక పోస్ట్ ద్వారా ఎన్నికల కమిషన్ పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తారు. కమిషన్ ముఖ్యమైన ఆధారాలను దాచిపెడుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన ఆరోపించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఓటర్ల గోప్యత, భద్రతను నిర్ధారించడం అవసరమని చెబుతూ, పోలింగ్ కేంద్రాల CCTV ఫుటేజ్‌లను 45 రోజుల్లోపు నాశనం చేయాలనే తన నిర్ణయాన్ని కమిషన్ సమర్థించుకుంది. ఓటర్ల గోప్యతా హక్కును పరిగణనలోకి తీసుకోవడంతో పాటు చట్టపరమైన ఆటంకాల […]

ఎవి ఇన్‌ఫ్రా భారీ మోసం

ప్రీలాంచ్, అధిక వడ్డీ తదితర హామీలతో 500మంది వద్ద వందల కోట్లు వసూలు చేసిన ఎవి ఇన్‌ఫ్రా కంపెనీపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారీ మోసం కావడంతో కేసును ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. తక్కువ ధరకు ప్లాట్లు విక్రయిస్తానని చెప్పడంతో దాదాపుగా 500మంది బాధితులు రూ.10లక్షలు నుంచి కోటి రూపాయల వరకు డిపాజిట్ చేశారు. బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు. […]

కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు..

గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీవ్ర ఉత్కంఠ మధ్య బెయిల్‌ మంజూరు అయిన తర్వాత కౌశిక్ రెడ్డి విడుదల అయ్యారు. బెదిరింపు కేసుపై సుమారు 4గంటల పాటు వాదనలు జరిగిన తర్వాత కాజీపేట రైల్వే కోడ్ జడ్జి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. దీంతో బీ అర్ ఎస్ శ్రేణులు ఆనందం మునిగాయి.

వందేభారత్‌లో ఎమ్మెల్యే అరాచకం

మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పరిచా వందే భారత్ రైల్లో ప్రయాణిస్తున్నాడు. అయనకు విండో సీట్ రాలేదు. ఓ ప్రయాణికుడిని సీట్లు మార్చుకోవాలని కోరాడు కానీ దానికి నిరాకరించాడు దీంతో ఎమ్మెల్యే ఫోన్లు చేసి ఝాన్సీ రైల్వే స్టేషన్ కు గూండాల్ని పిలిపించాడు. ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో దాదాపు 15-20 మంది వ్యక్తులు ప్రకాష్‌పై దాడి చేసి ముక్కు, చెవులు నోటి నుండి రక్తం కారేలా కొట్టారు. రైల్వే పోలీసులు ఎమ్మెల్యే అనుచరులకే […]

లండన్‌లో ప్రాణాంతక హీట్‌వేవ్..

హీట్ వేవ్ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేక బ్రిటన్‌ ప్రజలు అల్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా లండన్‌లో రికార్డు స్థాయిలో టెంపరేచర్ 34 డిగ్రీలను దాటింది. హీట్ వేవ్ కారణంగా పొంచివున్న ముప్పు గురించి ఇంగ్లండ్, వేల్స్‌ సహా స్కాంట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్‌ ప్రజలను నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈయూ దేశాలైన ఫ్రాన్స్, స్పెయిన్‌ కూడా హీట్ వేవ్‌తో సతమతమవుతున్నాయి. ఇలాంటి హీట్ వేవ్ 50 ఏళ్లలో ఒకసారి సంభవిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

ఆపరేషన్‌ సింధు.. భారత్‌కు 290 మంది భారతీయులు..

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆపరేషన్‌ సింధు చేపట్టి భారతీయులను ఇరాన్‌ నుంచి తరలిస్తున్నది. ఇప్పటి వరకు 517 మంది భారత పౌరులను సురక్షితంగా తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇందులో విద్యార్థులతో పాటు ఇతర పౌరులు ఉన్నారని పేర్కొంది.

తయారీ రంగంలో తిరోగమన అభివృద్ధి కనిపిస్తోంది..రాహుల్

రాహుల్‌గాంధీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. మేకిన్‌ ఇండియాతో దేశంలో తయారీరంగ పరిశ్రమ కొత్తపుంతలు తొక్కుతోందని ప్రధాని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు తయారీ రంగంలో తిరోగమన అభివృద్ధి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మేకిన్‌ ఇండియా ప్రభావం ఉంటే తయారీరంగ పరిశ్రమ రికార్డు స్థాయిలో ఎందుకు పడిపోయిందని, నిరుద్యోగ యువత సంఖ్య భారీగా ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. ప్రస్తుతం తయారీరంగ పరిశ్రమ వాటా దేశ ఆర్థికవ్యవస్థలో 14 శాతానికి పడిపోయిందని రాహుల్‌గాంధీ చెప్పారు.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి రిమాండ్

హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి.. కోర్టు జుడిషియల్ రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు. దీంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు ఖమ్మం జిల్లా జైలుకు తరలించనున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై ఉదయం నుం హైడ్రామా కొనసాగింది. కౌశిక్‌ది అక్రమ అరెస్ట్ అంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి కక్ష సాధిస్తోందంటూ ఆరోపించారు.

ఏడాదికి 500 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య

అంబేద్కర్ ఓవ‌ర్సీస్ ప‌థ‌కం కింద విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఇక‌ నుంచి ఏడాదికి 500 మందికి అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. అందుకు సంబంధించిన ఫైలుపై తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు, గిరిజ‌న అభివృద్ధి, దివ్యాంగుల‌, మైనార్టీ సంక్షేమ‌ శాఖల‌ మంత్రిగా అడ్లూరి ల‌క్ష్మణ్ తొలి సంత‌కం చేశారు. అంబేద్కర్ ఓవ‌ర్సీస్ స్కీమ్ ద్వారా ఇప్పటివ‌ర‌కు ఏటా 210 మంది ఎస్సీ విద్యార్థుల‌కు విదేశాల్లో ఉన్నత‌విద్యా అభ్యాసానికి రూ.20 ల‌క్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల సంఖ్యను 500 లకు పెంచారు.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త రూల్

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మిగిలిన సొమ్మును వారం రోజుల్లోగా ప్రభుత్వానికి జమ చేయాలని సెర్ప్ అధికారులు ఆదేశించారు. పింఛన్ పంపిణీ పూర్తయిన వెంటనే డబ్బులు జమ చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్ నెలలో ఇంకా రూ.4 కోట్లు సెర్ప్ ఖాతాకు చేరాల్సి ఉంది. గతంలో కొందరు ఉద్యోగులు నిధులతో ఉడాయించిన ఘటనలు జరిగాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON