ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మిగిలిన సొమ్మును వారం రోజుల్లోగా ప్రభుత్వానికి జమ చేయాలని సెర్ప్ అధికారులు ఆదేశించారు. పింఛన్ పంపిణీ పూర్తయిన వెంటనే డబ్బులు జమ చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్ నెలలో ఇంకా రూ.4 కోట్లు సెర్ప్ ఖాతాకు చేరాల్సి ఉంది. గతంలో కొందరు ఉద్యోగులు నిధులతో ఉడాయించిన ఘటనలు జరిగాయి.

