రాహుల్‌గాంధీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. మేకిన్ ఇండియాతో దేశంలో తయారీరంగ పరిశ్రమ కొత్తపుంతలు తొక్కుతోందని ప్రధాని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు తయారీ రంగంలో తిరోగమన అభివృద్ధి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మేకిన్ ఇండియా ప్రభావం ఉంటే తయారీరంగ పరిశ్రమ రికార్డు స్థాయిలో ఎందుకు పడిపోయిందని, నిరుద్యోగ యువత సంఖ్య భారీగా ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. ప్రస్తుతం తయారీరంగ పరిశ్రమ వాటా దేశ ఆర్థికవ్యవస్థలో 14 శాతానికి పడిపోయిందని రాహుల్‌గాంధీ చెప్పారు.

