loader

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై కారు దగ్ధం

నగరంలోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం సాయంత్రం ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఘటన కారణంగా కేబుల్ బ్రిడ్జి మీదుగా రోడ్డు నెంబర్ 45 వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేబుల్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న ఒక కారులో శుక్రవారం సాయంత్రం  ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు.. జనసేన

జనసేన పార్టీ కీలక ప్రకటన జారీ చేసింది. పార్టీ ముఖ్య నేతలను, నాయకులను ఉద్దేశించి కీలక ప్రకటన ఇచ్చింది. పార్టీ లైన్ దాటి ప్రవర్తించవద్దని.. ఎవరైనా హద్దు మీరి మాట్లాడితే కఠిన చర్యలు ఖాయమని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు జనసేన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేసింది. గురువారం జనసేనకు చెందిన ఓ నేత చేసిన ట్వీట్ వైరల్ కాగా.. ఈ ప్రకటన ఆయనను ఉద్దేశించి చేసిందేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆగ్రహించిన ఆర్ నారాయణమూర్తి..

ఆపరేషన్ కగార్‌ని వెంటనే ఆపి.. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ సందేశాత్మక ప్రసంగం చేశారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి. శత్రుదేశమైన పాకిస్థాన్‌తో చర్చలు జరిపి.. ఆపరేషన్ సిందూర్‌ని ఆపేశారే.. మన భరతమాత బిడ్డలైన నక్సలైట్‌‌లతో చర్చలు జరపకుండా వాళ్లని అంతదారుణంగా చంపడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ నారాయణ మూర్తి.

మాకేం సంబంధం.. తొక్కిసలాట ఘటనపై కర్ణాటక క్రికెట్‌ బోర్డు

చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక క్రికెట్‌ బోర్డు(కెఎస్‌సిఏ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ ఘటనతో మాకేం సంబంధమని పేర్కొంది. కేవలం కర్ణాటక ప్రభుత్వం, ఆర్సీబీ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని చెప్పింది. అభిమానులను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని..తొక్కిసలాటతో మాకు సంబంధం లేదని కెఎస్‌సిఏ చెప్పింది.

రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు…

రైతులకు కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రత్యేక కార్డులను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తుంది. దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. రైతుల యెక్క విశిష్ట గుర్తింపు కార్డులో ఆధార్ నంబర్‌తో లింకైన పట్టాదారు పాసు పుస్తకంలోని భూమి వివరాలను నమోదు చేస్తారు, వీటి ఆధారంగా ఒక ప్రత్యేకమైన నంబర్ కేటాయిస్తారు . రైతుల నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) తెలంగాణలో ప్రారంభమైంది. రైతుల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు సకాలంలో అందటంలేదని, వీటికి పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు […]

RDT సేవలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన

గ్రామీణులకు సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ. విద్యా, వైద్యం వంటి విషయాల్లో గత కొన్నేళ్లుగా సేవలు అందిస్తూ రాయలసీమవాసులకు, ముఖ్యంగా పేదల పాలిట వరంగా పేరొందిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) విదేశీ నిధుల వినియోగానికి ఆర్డీటీకి కేంద్రం అనుమతులు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆర్డీటీ సేవల కొనసాగింపుపై ఆందోళన వ్యక్తమవుతోంది. పేద‌ల పాలిట వ‌రమైన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) సేవలు ఆగ‌వని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో ఆర్డీటీ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

మస్క్ కి పిచ్చి పట్టింది…నేను అతనితో ఇక మాట్లాడను..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బిలియనీర్ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ కు మధ్య స్నేహం కాస్త చెడింది. మస్క్ పికల్లోతు కోపంతో ఉన్న ట్రంప్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు చెందిన ABC న్యూస్ తో జరిగిన సంభాషణలో ట్రంప్ మాట్లాడుతూ..”మస్క్ తన మతిస్థిమితం కోల్పోయాడు… నేను ఇకపై అతనితో మాట్లాడటానికి ఇష్టపడను” అంటూ చెప్పుకొచ్చారు.

రష్యా ప్రతీకారంతో ఉక్రెయిన్ వణికిపోయింది!

రష్యా 400 కంటే ఎక్కువ డ్రోన్లు, 40 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్‌లోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాలపై దాడి చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా భావోద్వేగ, కోపంతో కూడిన ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్ వైమానిక దళం అనేక క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేసి విజయవంతమైందని, అయితే ముగ్గురు అత్యవసర సేవా కార్మికులు మరణించారని, 49 మంది గాయపడ్డారని అన్నారు. శిథిలాల శుభ్రపరచడం, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

పట్టణాల్లో పేదలు ఉన్నచోటే జీ+3 ఇందిరమ్మ ఇండ్లు

ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ ప్ర‌క్రియ‌ గ్రామీణ ప్రాంతాలలో ఒక కొలిక్కి తీసుకువచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో కూడా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామ‌ని, హైదరాబాద్‌కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే త‌మ జీవ‌నోపాధికి ఇబ్బంది క‌లుగుతుంద‌న్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేద‌ని అన్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో ప్ర‌ధానంగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని మురికి వాడ‌ల్లో పేద‌లు ఉన్న‌చోటే జి+3 ప‌ద్ద‌తిలో ఇందిర‌మ్మ ఇండ్ల‌ను నిర్మించాలని నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్ల‌డించారు.

నీట్ పీజీ-2025 పరీక్ష కొత్త తేదీ

నీట్ పీజీ 2025 పరీక్ష తేదీ ఖరారు అయ్యింది. ఆగస్టు 3న ఒకే షిఫ్ట్‌లో నీట్ పీజీ 2025 పరీక్షను నిర్వహించనుంది. ఆగస్టు 3న నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE)ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపు 1,000 పరీక్షా కేంద్రాలు అవసరమని స్పష్టం చేసింది. జూన్ 15న జరగాల్సిన పరీక్షను ఆగస్టు 3న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య నిర్వహిస్తామని నేషనల్ బోర్డ్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON