చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక క్రికెట్ బోర్డు(కెఎస్సిఏ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ ఘటనతో మాకేం సంబంధమని పేర్కొంది. కేవలం కర్ణాటక ప్రభుత్వం, ఆర్సీబీ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని చెప్పింది. అభిమానులను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని..తొక్కిసలాటతో మాకు సంబంధం లేదని కెఎస్సిఏ చెప్పింది.

