నగరంలోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం సాయంత్రం ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఘటన కారణంగా కేబుల్ బ్రిడ్జి మీదుగా రోడ్డు నెంబర్ 45 వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేబుల్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న ఒక కారులో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

