నీట్ పీజీ 2025 పరీక్ష తేదీ ఖరారు అయ్యింది. ఆగస్టు 3న ఒకే షిఫ్ట్‌లో నీట్ పీజీ 2025 పరీక్షను నిర్వహించనుంది. ఆగస్టు 3న నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE)ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపు 1,000 పరీక్షా కేంద్రాలు అవసరమని స్పష్టం చేసింది. జూన్ 15న జరగాల్సిన పరీక్షను ఆగస్టు 3న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య నిర్వహిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) పేర్కొంది.

