loader

మా న్యూస్ four యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

ప్రతి క్షణం ప్రతి వార్త మీ కోసం సంక్షిప్త వార్త ప్రపంచం లో సరికొత్త మార్పు మా స్మార్ట్ న్యూస్ యాప్ తో ప్రపంచం తో అప్డేట్ అవ్వండి

టాటా కెమికల్స్‌కు చంద్రశేఖరన్ రాజీనామా..

టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ టాటా కెమికల్స్ బోర్డు డైరెక్టర్, ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. తన ఇతర బాధ్యతలను పేర్కొంటూ చంద్రశేఖరన్ టాటా కెమికల్స్‌లో ఉన్నత పదవికి రాజీనామా చేశారు. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆయన రాజీనామాను ధృవీకరించింది. నా ప్రస్తుత, భవిష్యత్తు బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని బోర్డు నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా పదవీకాలంలో నాకు లభించిన మద్దతు, భాగస్వామ్యానికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని ఎన్ చంద్రశేఖరన్ బోర్డుకు రాసిన లేఖలో […]

తెలంగాణపై ఉరుముతున్న వరుణుడు..

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. రేపు, ఎల్లుండి తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ అధికారులు. మెజారిటీ రాష్ట్రాల్లో ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది ఐఎండీ. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చింది.

స్పెర్మ్ డోనర్ చేసిన చిన్న పొరపాటు.. 10 మంది పిల్లలకు క్యాన్సర్..

సంతానం కోసం స్పెర్మ్ డోనర్ల సహాయం తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణం.  యూరప్‌లో జరిగిన ఒక సంఘటన తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. తనకు తెలియకుండానే ఒక క్యాన్సర్ కారక జన్యు మార్పును కలిగి ఉన్న ఓ స్పెర్మ్ డోనర్ వల్ల, అతను తండ్రి అయిన 67 మంది పిల్లల్లో ఏకంగా 10 మందికి క్యాన్సర్ సోకినట్లు తాజాగా నివేదికలు వెల్లడించాయి ఒకే డోనర్ వీర్యాన్ని ఎంత మందికి వాడాలి అనే దానిపై సరైన నియంత్రణలు లేకపోవడం ఈ పరిస్థితికి […]

ఉద్యోగులకు కేంద్రం బిగ్ షాక్.. పెన్షన్ కొత్త రూల్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 2021లో కీలక సవరణలు చేసింది. పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను ఈ కొత్త రూల్స్ ప్రభావితం చేయనున్నాయి. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) సవరణ నిబంధనలు 2025 ప్రకారం.. క్రమశిక్షణా చర్యలతో ఉద్యోగిని విధుల నుంచి తొలగించినప్పుడు సదరు ఉద్యోగి కేవలం పీఎస్‌యూ బెనిఫిట్స్ మాత్రమే కోల్పోడు, ప్రభుత్వ సర్వీసుల్లో పొందిన పెన్షన్ బెనిఫిట్స్ సైతం కోల్పోవాల్సి వస్తుంది.

కడపలో మహానాడు నిర్వహించడం సత్తా కాదు- చంద్రబాబుకు జగన్ సవాల్

కడపలో మహానాడు నిర్వహించడం సత్తా కాదని హామీలు అమలు చేయడం అసలైన సత్తా అన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిందని, దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో చట్టం మరియు శాంతిభద్రతలు క్షీణించాయని, టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  “జగనన్న 2.0″గా తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని, కార్యకర్తలను రక్షించడానికి, బలోపేతం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఎలాన్ మస్క్-డొనాల్ట్ ట్రంప్‌కు చెడిందా..

ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయా. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మస్క్‌కు నచ్చడం లేదా. తాజాగా ట్రంప్ తీసుకువచ్చిన బిల్లుపై.. ఎలాన్ మస్క్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేయడం దేనికి సంకేతం. ట్రంప్ తెచ్చిన బిల్లుతో భారీగా వ్యయం అవుతుందని.. ఇది ప్రభుత్వ వృథా ఖర్చును అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన డోజ్‌కు వ్యతిరేకంగా ఉందని ఎలాన్ మస్క్ పేర్కొంటున్నారు. దీంతో ట్రంప్-మస్క్ బ్రోమాన్స్ చెడిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.

టీడీపీ అధ్యక్షుడిగా మరోసారి సీఎం చంద్రబాబు

కడపలో జరుగుతున్న మహానాడులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికై చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రమాణం చేయించారు. ఉదయం జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదల చేశారు. జాతీయ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రకటించారు. 1995లో చంద్రబాబు నాయుడు తొలిసారిగా టీడీపీ పగ్గాలు చేపట్టారు.

ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువులతోనే సాధ్యం: సిఎం

సమాజంలో రుగ్మతలు అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌లో బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో గురుకుల అవార్డుల ప్రధానోత్స కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలితులుగా ఉన్నా ఎస్సి, ఎస్టిలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. చాలామంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదని.. చదువు మాత్రమే అని సిఎం అన్నారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువులతోనే సాధ్యమవుతోందని తెలిపారు.

ఏపీ నర్సింగ్ కామన్‌‌ ఎంట్రన్స్‌ టెస్ట్-2025

ఆంధ్రప్రదేశ్‌ నర్సింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరంలో నాలుగేళ్ల బిఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాల కోసం ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్‌ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నేటి నుంచి(మే 28) నుంచి జూన్‌ 20వ తేదీ సాయంత్రం ఆరుగంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. అధికారిక వెబ్ సైట్ https://drntr.uhsap.in/index/

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON