ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయా. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మస్క్‌కు నచ్చడం లేదా. తాజాగా ట్రంప్ తీసుకువచ్చిన బిల్లుపై.. ఎలాన్ మస్క్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేయడం దేనికి సంకేతం.
ట్రంప్ తెచ్చిన బిల్లుతో భారీగా వ్యయం అవుతుందని.. ఇది ప్రభుత్వ వృథా ఖర్చును అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన డోజ్‌కు వ్యతిరేకంగా ఉందని ఎలాన్ మస్క్ పేర్కొంటున్నారు. దీంతో ట్రంప్-మస్క్ బ్రోమాన్స్ చెడిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.

