సమాజంలో రుగ్మతలు అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌లో బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో గురుకుల అవార్డుల ప్రధానోత్స కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలితులుగా ఉన్నా ఎస్సి, ఎస్టిలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. చాలామంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదని.. చదువు మాత్రమే అని సిఎం అన్నారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువులతోనే సాధ్యమవుతోందని తెలిపారు.

