ఇండియన్ స్టాక్ మార్కెట్లు సోమవారం రోజు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 3 శాతం మేర పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఆరంభంలోనే భారీ అమ్మకాలతో ఏకంగా రూ.12.39 లక్షల కోట్లు ఆవిరైపోయింది. కేవలం 10 నిమిషాల్లోని మొత్తం కంపెనీల విలువ భారీగా కోసుకుపోయి రూ.437 లక్షల కోట్లకు దిగివచ్చింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 100 డాలర్లు దాటింది. అలాగే భారతీయ రూపాయి మారకం విలువ సైతం తగ్గడం మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది.

