నగరంలో ఓ యూట్యూబర్ దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మరీ అతడిపై రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యూట్యూబర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గోల్కొండలోని కుమార్‌వాడి ఏరియాకు చెందిన యూట్యూబర్ షేక్ మహబూబ్ ఏడాదిన్నర క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి అమ్మాయి తరఫు వారికి ఏమాత్రం ఇష్టం లేదు. మహబూబ్, అతడి అత్తింటి వారికి మధ్య గొడవలు ఆగలేదు. ఈ కారణంతోటే మహబూబ్ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

