హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలోని రహదారికి “డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ” అని పేరు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించే కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో మాత్రం ఆయన పేరుతో రోడ్డును ఎలా ప్రారంభిస్తుందని శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. అసలు డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ జాతీయ సిద్ధాంతాలను పక్కనబెట్టి ప్రైవేట్ ఫ్రాంచైజీ రాజకీయం చేస్తోందా?” అని దాసోజు శ్రవణ్ కుమార్ నిలదీశారు.