డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే ఇప్పుడు అనూహ్యంగా తన వైఖరి మార్చుకుందా? బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సిద్ధమయ్యారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. తమిళనాడుకు ప్రస్తుతం లోక్సభలో ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదని స్టాలిన్ డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీ స్థానాల నిష్పత్తిని మరో 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలని కోరారు.