ఒంటరి తల్లుల సంరక్షణలో పెరిగే పిల్లలకు వారి తల్లి కులం ఆధారంగా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విడాకులు, తండ్రి వదిలివేయడం లేదా దత్తత వంటి ప్రత్యేక పరిస్థితుల్లో తల్లి సంరక్షణలో ఉన్న పిల్లలకు తల్లి కులాన్ని వర్తింపజేసేలా మార్గదర్శకాలు రూపొందించే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.