తమిళనాడులోని మధురై తిరుప్పరంకుండ్రం కొండపై నేడు కార్తీక దీపం వెలిగించేందుకు సర్వం సిద్ధమైంది. సుప్రీంకోర్టు జారీ చేసిన కీలక ఆదేశాల నేపథ్యంలో ఈరోజు కొండపై దీప జ్వాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. CRPF బలగాలు ఇప్పటికే మధురై చేరుకుని, తిరుప్పరంకుండ్రం కొండపై భద్రతా బాధ్యతలను స్వీకరించాయి. కేంద్ర బలగాలు కొండ వద్దకు చేరుకున్న సమయంలో స్థానిక ప్రజలు వారిపై పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.