కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి బహుశా రాజకీయ లక్ష్యాలు ఉండి ఉండవచ్చని ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. సీజేపీ రాజకీయంగా మారితే యువతకు అనేక అవకాశాలు వస్తాయనేది నిజం. కానీ, ఇలాంటి ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా, తటస్థంగా ఉంచితేనే మంచిది. ప్రజలు సీజేపీని నిష్పక్షపాతంగా నడిచే యువత, విద్యార్థుల ఉద్యమ శక్తిగా చూస్తున్నారు. తటస్థంగా ఉంటూ, ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే సంస్థ అని భావిస్తున్నారు. రాజకీయ శక్తిగాకంటే ఉద్యమ శక్తిగా ఉంచడమే మంచిది అన్నారు.