కోల్కతాలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కార్యక్రమానికి హాజరై నిరాశకు గురైన అభిమానులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. గతేడాది గందరగోళం మధ్య జరిగిన ఈవెంట్కు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు వారి డబ్బును తిరిగి చెల్లిస్తామని సీఎం సువేందు అధికారి ప్రకటన చేశారు. 33,000 మంది క్రీడాభిమానుల టికెట్ డబ్బులను రాష్ట్ర క్రీడా బడ్జెట్ నుంచి వాపస్ ఇచ్చే ప్రక్రియను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. 4,000 నుండి రూ. 6,000 విలువైన టికెట్లు కొన్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

