శుక్రవారం కన్నాట్ ప్లేస్లో CJP మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే, దీనిని అడ్డుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) శుక్రవారం (అక్టోబర్ 16న) కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్లో నిర్వహించతలపెట్టిన నిరసనలను అడ్డుకునేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. చట్టప్రకారం ఈ సభను నియంత్రించడానికి, జనసమీకరణను అదుపుచేయడానికి ‘సాధ్యమైన అన్ని చర్యలు’ తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు ఇచ్చిన హామీని కోర్టు రికార్డుల్లోకి తీసుకుంది.