కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి భారీ ఊరట లభించింది. కేంద్రం నిషేధించిన ఆ పార్టీ ఎక్స్ ఖాతాను తిరిగి పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నీట్ పరీక్షపై ఆ పార్టీ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులతో ఇప్పుడు వచ్చే ఇబ్బందేమీ లేదని, ఆ పరీక్ష పూర్తైనందున ఏ సమస్య ఉండదని, అందువల్ల ఎక్స్ ఖాతా తిరిగి పునరుద్ధరించాలని కోర్టు సూచించింది. ఇటీవల సీజేపీకి చెందిన ఎక్స్ ఖాతాను కేంద్రం నిషేధించింది.