విజయవాడలో నిర్వహించిన ఏపీ హస్తకళా మహోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. “వంశపారపర్యంగా వచ్చిన కళను ముందుకు తీసుకెళ్లడం కూడా ముఖ్యమే. హస్తకళా రంగాలు భారతదేశ మూలాలు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగాలంటే హస్తకళను, చేనేతను కాపాడుకోవాలి. మారుమూల గ్రామంలోని కళాకారుడి కృషి.. ప్రపంచానికి చేరాలనేదే ప్రభుత్వ లక్ష్యం. వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు.. లోకల్ టు గ్లోబల్ లక్ష్యంగా పని చేద్దాం”,ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.