సదరం దరఖాస్తుదారులు స్లాట్ బుకింగ్ కోసం దరఖాస్తును సచివాలయానికి తీసుకెళ్లే ముందే సంబంధిత ఆన్‌లైన్ లింక్ ద్వారా అధికారిక డిక్లరేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి ప్రభుత్వం మూడు నెలల స్లాట్లను ఒకేసారి ఖరారు చేసింది. ఇకపై జోన్ల వారీగా మాత్రమే బుకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇతర జిల్లాలకు వలస వెళ్లిన దివ్యాంగులు సైతం కచ్చితంగా తమ సొంత జిల్లా పరిధిలోని జోనల్ ఆసుపత్రుల్లోనే స్క్రీనింగ్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

