నటుడు ప్రకాశ్ రాజ్ చుట్టూ మరో వివాదం ముసురుకుంది. హిందూ సమాజాన్ని తీవ్రంగా కించపరిచేలా, వివిధ కులాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆయన నిరంతరం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ BJP నాయకులు పోలీసులను ఆశ్రయించారు. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు ప్రకాశ్ రాజ్‌పై కదిరి పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేశారు.