జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్ పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 30న వీరి వివాహం జరిగింది. వీరిద్దరూ ఒక్కటైన విషయాన్ని ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా వెల్లడించారు. నిధి రజ్దాన్తో కలిసి దిగిన ఫొటోలను ఆయన పంచుకున్నారు. నిన్న కొత్త ప్రయాణం ప్రారంభమైంది’ అని ఒమర్ పెట్టిన ఫోటో క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒమర్ అబ్దుల్లా కు గతంలో పాయల్ అబ్దుల్లాతో పెళ్లి జరగగా ఈ ఏడాది జూలై 31న విడాకులు తీసుకున్నారు.