అనంతరం జిల్లా రాప్తాడు మండలం అయ్యవారిపాలెంలో యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలికను మెరుగైన వైద్యం కోసం బెంగళూరు కు తరలిస్తున్నారు. ఈ మేరకు అధికారులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక అంబులెన్స్‌లో బాలికను తరలిస్తున్నారు. ఉన్మాది దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలిక తలలో తీవ్ర గాయాలు ఉన్నట్లు మంత్రి సత్య ప్రసాద్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్తున్నారు.