విశాఖతీరంలో అలజడి నెలకొంది చేపల వేట కోసం వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకోగా, వారిలో ఒకరైన కారె చిన్నయ్యను సురక్షితంగా బయటపడ్డాడని విశాఖపట్నంలోని మత్స్యకార నాయకుడు రాజేష్ తెలిపారు. మిగిలిన ఆరుగురి ఆచూకీ కోసం భారత కోస్ట్ గార్డ్ , భారత నేవీ, మెరైన్ పోలీసులు యుద్ధప్రాతిపదికన గాలింపు కొనసాగిస్తున్నారు అని అన్నారు. ప్రతికూల వాతావరణం, అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో బోటుకు సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో బోటుతో సంబంధాలు తెగిపోవడంతో వెంటనే సహాయక చర్యలు అధికార యంత్రాంగం ప్రారంభించింది.