దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది.సియోల్‌లో వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అనుకూలతలను లోకేశ్ వారికి వివరంగా తెలియజేశారు. సియోల్ బిజినెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కొరియన్ స్టార్టప్ ఫౌండర్లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేశ్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా “వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ప్రెన్యూర్” నినాదంతో ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు, ఒక లక్ష ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు